తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఈ రోజు ఉదయం తార్నాక, లాలపేట, మల్కాజిగిరి ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాల ఉత్సవాల్లో భాగంగా తార్నాకలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం, లాలాపేట్‌లోని శ్రీ పోచమ్మ ఆలయం, మల్కాజిగిరిలోని శ్రీ ఉజ్జయిని మహాంకాళి ఆలయం, సఫిల్‌గూడలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాలను రాంచందర్ రావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Also Read-

బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని రాంచందర్ రావు అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, సమృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X