ప్రధాని మోదీ స్పూర్తితో నా కళను పది మందికి నేర్పిస్తా: చేనేత కార్మికుడు హరి ప్రసాద్ (video)

ఊహించని భాగ్యం దక్కింది

ప్రధాని నా గురించి మాట్లాడటం నా జీవితాంతం మర్చిపోలేనిది

మోదీ స్పూర్తితో నా కళను పది మందికి నేర్పిస్తా

శెభాష్…. అందుకు అవసరమైన సాయం చేస్తానన్న బండి సంజయ్

హరి ప్రసాద్ ను ఘనంగా సన్మానించిన బండి సంజయ్

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తన చేతితో స్వయంగా నేసిన జీ-20 వస్త్రాన్ని చూపిస్తూ తన పేరును పదేపదే ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని సిరిసిల్ల చేనేత కార్మికుడు హరి ప్రసాద్ అన్నారు. తనకు ఊహించని భాగ్యం దక్కిందని ఉద్వేగానికి లోనైన హరిప్రసాద్ టీవీలో మన్ కీ బాత్ ప్రోగ్రాం ను చూస్తూ ఉబ్బితబ్బిబ్బైపోయారు.

• అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆడెపు రవీందర్ తో కలిసి ఈరోజు కరీంనగర్ కు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ ను బండి సంజయ్ ఘనంగా సన్మాంచారు.

• ప్రధాని స్పూర్తితో కనుమరుగవుతున్న చేనేత కళను పది మందికి విస్తరించాలనే కోరిక ఉందని హరిప్రసాద్ పేర్కొనడంతో వెంటనే స్పందించిన బండి సంజయ్ ‘‘శేభాష్… 10 మందికి చేనేత కళను అందించేందుకు పూనుకోవడం గొప్ప విషయం. అందుకు అవసరమైన సహాయ సహకారాలు, ఆర్దిక సాయం అందజేస్తా‘‘ అని హామీ ఇచ్చారు.

• అనంతరం హరి ప్రసాద్ మాట్లాడుతూ బండి సంజయ్ కు, తనకు సహకరించిన ఆడెపు రవీందర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X