Telangana: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, ఎప్పుడు, ఎందుకు మరియు ఎక్కడ

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈనెల 22న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి అధ్యక్షతన జరగనున్నాయి. ఈ సమావేశానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ & బిజెపి జాతీయ సహా ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శ్రీ శివ ప్రకాష్ జీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు & పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి కె అరుణ, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ ఛుగ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్, బిజెపి జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జ్ శ్రీ అరవింద్ మీనన్ తదితరులు పాల్గొంటారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి జాతీయ నాయకులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర పదాధికారులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి జిల్లా అధ్యక్షులు, బిజెపి జిల్లా ఇన్చార్జులు తదితరులు పాల్గొంటారు. అదేవిధంగా ఈనెల 23, 24 తేదీలలో జిల్లా కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 25, 26 తేదీలలో మండల కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X