పోలీసులు రిక్వెస్ట్ మేరకు నేను ఇప్పుడు కరీంనగర్ వెలుతున్నా- బండి సంజయ్ (Photos & Video)

Hyderabad: నిర్మల్ వెళుతున్న బండి సంజయ్ ను జగిత్యాల దాటాక అడ్డుకున్న పోలీసులు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను చుట్టుముట్టిన పోలీసులు. పాదయాత్ర కు అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ నేతలు, కార్యకర్తలు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు. కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కామెంట్స్…

పాద యాత్ర కు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత చివరి క్షణంలో అనుమతి లేదని చెప్పడమా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ వస్తున్నారని సమాచారం పోలీసులకు పంపాం. దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షించి యూటర్న్ తీసుకుంటారా? రూట్ మాకు కూడా ప్రకటించి, బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాక హఠాత్తుగా అనుమతి లేదంటారా? బైంసా సున్నిత ప్రాంతం అంటున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దు. బైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి? ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర కు వెళుతుంటే అడ్డుకుంటారా? రేపు బహిరంగ సభకు వెళ్లి తీరుతా. పాదయాత్ర చేస్తా. రేపు మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉంది. అప్పటివరకు వెయిట్ చూస్తాం. న్యాయస్థానం తలుపు తడతాం. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి? పోలీసుల రిక్వెస్ట్ మేరకు నేను ఇప్పుడు కరీంనగర్ పోతున్న. నిర్మల్ లో బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు. ఎస్పీని కలవడానికి వెళుతున్నా అడ్డుకుని దారుణంగా కొడుతున్నారు. భేషరతుగా కార్యకర్తలను విడుదల చేయాలి. మీరు రెచ్చకోట్టినా మేం సoయంనంతో ఉన్నాం. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దు.

బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ ప్రకటన…

బండి సంజయ్ పాద యాత్ర ను అడ్డుకోవడం పై సిగ్గు చేటు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమ తించకపోవడం పిరికిపంద చర్య. ఓటమి భయంతోనే కెసిఆర్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. తెలంగాణలో బిజెపి బలపడుతుందని కెసిఆర్ జీర్ణించుకో లేకపోతున్నాడు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రేపటి నుంచి భైంసాలో ప్రారంభం కావలసిన బండి సంజయ్ 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” & బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రలను శాంతిభద్రతలు అనే కుంటి సాకుతో కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బండి సంజయ్ పాదయాత్రకు, కావాలనే కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… న్యాయస్థానంలో పోరాటం చేసి, పాదయాత్రను, బహిరంగ సభను జరిపి తీరుతాం. వెంటనే రేపు భైంసాలో జరిగే పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

నిర్మల్​ జిల్లా భైంసాకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి సంజయ్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రేపటి నుంచి మొదలుకానున్న పాదయాత్ర కోసం ఆయన భైంసాకు వెళ్తున్నారు. పాదయాత్ర సహా ప్రారంభ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. రేపు ప్రారంభం కాబోయే ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. రేపు నిర్మల్ జిల్లా భైంసా నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా… ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. శాంతి భద్రతల దృష్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లా ఎస్పీ సురేష్ ధ్రువీకరించారు. ఈ రోజు రాత్రి నిర్మల్​ జిల్లా భైంసాకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి సంజయ్ ను అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X