హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములైన అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందని వివరించారు. ఇప్పటికే విశ్వవిద్యాలయం సామాజిక బాధ్యతను నెరవేరుస్తూనే, విశ్వవిద్యాలయం రూపొందించిన ‘సమాన అవకాశాల ప్రణాళిక’ కింద రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు, ఇతర వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన పిల్లలకు ఉచిత ఉన్నత విద్య సేవలను అందిస్తుందని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐ (AI) శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ. 12.9 కోట్ల నిధులతో ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA) కింద DRC భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
Also Read-
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణా రెడ్డి, ప్రొ. ఇ. సుధారాణి; ప్రొ. ఐ. ఆనంద్ పవార్, ప్రొ. బి. శ్రీనివాస్, ప్రొ. పి. వెంకటరమణ, డా. బానోత్ ధర్మ, ప్రొ. జి. దయాకర్, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. కె. కృష్ణా రెడ్డి, ప్రొ. కె. ప్రమీల, డా. ఎ. రమాదేవి, ఎన్సీ వేణుగోపాల్, అన్ని విభాగాల డైరెక్టర్స్, అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
