‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ను విజయవంతం చేయండి, ప్రజలకు తెలంగాణ రక్షణ సేన నాయకుల పిలుపు

హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన నిర్వహిస్తున్న ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. స్టేడియంలో వేదిక ఏర్పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తల సీటింగ్, స్టేడియంలో ఆవరణలో పార్కింగ్ సహా ఇతర ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు.

ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖులు పాల్గొని సామాజిక న్యాయ తెలంగాణ సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

సబ్బండ వర్గాలకు కవితమ్మతోనే న్యాయం : టీఆర్ఎస్ నాయకులు

సబ్బండ వర్గాలకు కవితమ్మనే న్యాయం చేస్తారని తెలంగాణ రక్షణ సేన నాయకులు పేర్కొన్నారు. సోమవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం టీఆర్ఎస్ నాయకులు నరేశ్ ప్రజాపతి, కోల శ్రీనివాస్, ఎత్తరి మారయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం దక్కాలనే సంకల్పంతో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పని చేస్తున్నారని అన్నారు.

Also Read-

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలనే ఉద్దేశంతో ఆమె పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కూడా శాసన మండలి, అసెంబ్లీ వైపు చూడని ఎన్నో కులాల గురించి శాసన మండలిలో కవిత ప్రస్తావించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X