माओवादी तिप्पिरी तिरुपति और मल्ला राजी रेड्डी को कोर्ट में पेश करने के लिए आंध्र प्रदेश हाई कोर्ट में पिटीशन

हैदराबाद: सेंट्रल सिक्योरिटी फोर्स माओवादियों को खत्म करने के मकसद से दंडकारण्य इलाकों में सर्चिंग कर रही है। इस प्रोसेस में माओवादी पार्टी के लेटेस्ट टॉप लीडर, मोस्ट वांटेड हिडमा, उसकी पत्नी और छह बॉडीगार्ड मारे गए। हालांकि, इस महीने की 28 से 30 तारीख तक ऑल इंडिया DGP मीटिंग होने वाली है। इसका एजेंडा माओवादियों को खत्म करना, ऑपरेशन कगार और देश में टेररिस्ट हमलों को रोकना है। तब तक सेंट्रल गवर्नमेंट माओवादियों की आवाज़ भी न सुनने के लिए तेज़ी से तीन-तरफ़ा हमले की प्लानिंग कर रही है। इस बीच तेलंगाना SIB टॉप माओवादी लीडरों को सरेंडर कराने के टारगेट के साथ स्ट्रैटेजी बना रही है।

दूसरी तरफ, माओवादी पार्टी के एक और टॉप लीडर देवजी उर्फ ​​तिप्परी तिरुपति और मल्ला राजी रेड्डी के लिए AOB में कॉम्बिंग ऑपरेशन ज़ोरों पर चल रहा है। इसी बीच तेलंगाना के गंगाधर नाम के एक आदमी ने आंध्र प्रदेश हाई कोर्ट में माओवादी तिप्पिरी तिरुपति और मल्ला राजी रेड्डी को कोर्ट में पेश करने की मांग करते हुए एक पिटीशन फाइल की है। दायर पिटीशन में कहा गया है कि पुलिस ने देवजी उर्फ ​ तिरुपति और मल्ला राजी रेड्डी को इस महीने की 18 तारीख को कस्टडी में लिया है। दायर इस पिटीशन पर शुक्रवार को हाई कोर्ट बेंच के सामने सुनवाई होगी।

Also Read-

మావోయిస్టులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా, ఆయన భార్యతో సహా అంగరక్షకులు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్, టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగబోతోంది. అప్పటి లోపే మావోయిస్టుల మాటే వినిపించకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముప్పేట దాడికి ప్లాన్ చేస్తోంది. ఇక మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటే టార్గెట్‌గా తెలంగాణ ఎస్‌ఐబీ వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిల కోసం ఏవోబీలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే, అనూహ్యంగా మావోయిస్టులు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో ప్రవేశపెట్టాలని తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఈ నెల 18న పోలీసులు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను నిర్బంధంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ రేపు హైకోర్టు ధర్మాసనం ఎదుటకు విచారణకు రానుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar