హైదరాబాద్ : హైకోర్టులో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పై కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు తీర్పు డాక్యుమెంట్ కాపీలు వచ్చిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అన్నది కాంగ్రేస్ పార్టి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను నమ్ముతుంది.
బీసీ లకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ, BRS నేతలు నోటికాడి ముద్దలాగుతున్నాయి. మేము బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పని చేసింది బ్రిటిష్ కాలంలో చేసిన కుల సర్వే దేశంలో మొదటిసారి చరిత్రలో శాస్తుర్యబద్ధంగా జరిగింది కుల సర్వే.
ఆ ఆదారంగానే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయం తో పని చేస్తున్నాం. BRS కాబ్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది..అడుగడుగున బీసీ లను అణగదొక్కింది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆదిశగా ముందుకు పోతున్నాం. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో ఇచ్చాం ఈరోజు కోర్టు స్టే ఇచ్చింది. మాకు చిత్తశుద్ధి ఉంది.
సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం.
Also Read-
సీఎం,కేబినెట్ పార్టీ అంత ఢిల్లీ వెళ్లి ధర్నా చేశాం. బీసీ సంఘాలు కుల సంఘాలు ధర్నా చేస్తే బీజేపీ, BRS నేతలు లు ఎందుకు చేయలేదు. మా సీనియర్ నాయకులు విహెచ్ లాంటి వారు హైకోర్టు లో ఇంప్లీడ్ అయితే .. బీజేపీ brs నేతలు ఏ ఒక్కరు ఎందుకు ఇంప్లీడ్ కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం. మేము డిల్లీలో పోరాడినప్పుడు మీరు ఎక్కడ తోక ముడుచుకొని తలదాచుకున్నారు? మేము కోర్టులో పోరాటం చేస్తుంటే ఎందుకు మీరు ఇంప్లీడ్ కాలేదు. బీసీలకు వ్యతిరేకంగా ఉన్న మీరు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు.
