హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు గాను డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రత్యేక గుర్తింపు, ప్రశంసా పత్రాన్ని అందించింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేపట్టిన మొక్కల పెంపకం, చెట్ల రక్షణ, పురాతన రాళ్ళ పరిరక్షణకు గాను ఈ గుర్తింపును ఇచ్చినట్లు ఆ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, హరిత, పక్షుల, ఇతర జంతువులకు హాని కలగకుండా చర్యలు చేపట్టడం ద్వారా ఈ గుర్తింపు దక్కినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఈ పర్యావరణ పరిరక్షణకు గాను ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం అధ్యాపక, అధ్యాపకేతర బృందం, అంకితభావంతో పని చేసిన సమిష్టి కృషికి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.
Also Read-
పర్యావరణ సమతుల్యతకు ప్రత్యేక బయో డైవర్సిటీ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, ఫ్లోరా అండ్ ఫానా అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ గుర్తింపుతో పర్యావరణ పరిరక్షణలో తమ భాద్యత మరింత పెరిగిందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి పేర్కొన్నారు.
