“టెక్నాలజీ యుగంలోనూ పుస్తకం హవా కొనసాగుతోంది”

కరీంనగర్ కళల కాణాచి

  • చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే
  • జిల్లాలో పుస్తక మహోత్సవం నిర్వహించడం సంతోషం
  • టెక్నాలజీ యుగంలోనూ పుస్తకం హవా కొనసాగుతోంది
  • జిల్లా కలెక్టర్ తో కలిసి కరీంనగర్ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా కళలకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చరిత్రసహా తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్క్రుతి, సంప్రాదాయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలు పఠనం చాలా ముఖ్యమని చెప్పారు. పుస్తకాలతోనే విజ్ఝానాన్ని పెంచుకోవచ్చన్నారు. చిరిగిన బట్టలైనా వేసుకో… కానీ పుస్తకం కొనుక్కో అనే సామెతే ఇందుకు నిదర్శనమన్నారు.

ఈరోజు కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన ‘‘కరీంనగర్ పుస్తక మహోత్సవం’’ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సహా పలువురు అధికారులు బండి సంజయ్ కు స్వాగతం పలికారు. వారితో కలిసి పుస్తక స్టాళ్లను సందర్శించిన బండి సంజయ్ పలు పుస్తకాలను కొనుగోలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యంశాలు…

• నేను పక్కా పొలిటీషియన్ ను కాదు. మంచిని మంచి చెడును చెడు అని చెప్పడం నాకు అలవాటు. కరీంనగర్ కళల కాణాచి. డాక్టర్ సి.నారాయణరెడ్డి సహా ఎంతో మంది కవులు, కళాకారులు, రచయితలకు జన్మనిచ్చిన గడ్డ ఇది.

• ఏ చరిత్ర అయినా తెలుసుకోవాలంటే పుస్తకాలను చదవాల్సిందే. భారత అణుబాంబు పితామహుడు, టెక్నాలజీలో దిట్ట, రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం పుస్తకాలతోనే జ్ఝానాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పారు. మొబైల్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఈరోజుల్లోనూ పుస్తకం చదివితేనే త్రుప్తి కలుగుతోంది.

• చినిగిన, పాత బట్టలైనా వేసుకో – కొత్త పుస్తకాన్ని కొనుక్కో అనే సామెత పుస్తకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. పుస్తకంలోని జ్జానాన్ని తెలుసుకోవడంతోపాటు ఆ జ్ఝానాన్ని పదిమందికి పంచితేనే సమాజానికి మేలు జరుగుతుంది.

• మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా మహిళలందరికీ ముందస్తు శుభాకాంక్షలు. ఆ దేశంలో మహిళలు సుఖసంతోషాలతో ఉంటారో ఆ దేశం అన్ని విధాలా బాగుపడ్డట్లు లెక్క. మహిళను దేవతగా కొలిచే దేశం మనది. మహిళలను గౌరవించాలి. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా చేయూత నివ్వాలని కోరుకుంటున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X