హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్, డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి ఆమె సంబరాల్లో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో నిర్మలా జగ్గారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి జెండాను ఎగురవేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే సాకారం చేసిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
Also Read-
ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జార్జ్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ లు రమేష్, వంశీ, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
