హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది.
బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పది పలితాల కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే వెబ్‌సైట్లల్లోనూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఫలితాలను వెంటనే తెలుసుకోవడానికి bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.inని
వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. (ఏజెన్సీలు)
संबंधित खबर:
तेलंगाना 10वीं कक्षा के वार्षिक परीक्षा परिणाम जारी
हैदराबाद: तेलंगाना 10वीं कक्षा के वार्षिक परीक्षा परिणाम जारी कर दिए गए हैं> शिक्षा प्रमुख सचिव बुर्रा वेंकटेशम ने मंगलवार सुबह 11 बजे बशीरबाग स्थित एससीईआरटी कार्यालय में दसवीं के नतीजे जारी किए। दसवीं के नतीजों में 91.31 पास प्रतिशत दर्ज किया गया।
लड़कियों का उत्तीर्ण प्रतिशत 93.23 प्रतिशत और लड़कों का उत्तीर्ण प्रतिशत 89.42 प्रतिशत रहा है। 3,927 स्कूलों में 100 प्रतिशत उत्तीर्ण प्रतिशत दर्ज किया गया जबकि छह स्कूलों में शून्य उत्तीर्ण प्रतिशत दर्ज किया गया। पिछले साल पास प्रतिशत 89.60 फीसदी था, लेकिन इस साल यह बढ़कर 91.31 फीसदी हो गया है। कुल 5,05,813 छात्र परीक्षा में बैठे और 4,91,862 छात्र उत्तीर्ण हुए हैं।