గాంధీభవన్లో ఘనంగా తూర్పు జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు, మరి దాని పై మండిపాటు…

హైదరాబాద్ : గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు కుమార్ రావు, అల్లం భాస్కర్ , శ్రీనివాస్, శివ రాథోడ్, మల్లేష్, రాఘవేందర్, వెంకన్న, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

మరోవైపు జగ్గా రెడ్డి జన్మదినం సందర్భంగా GHMC ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ఖైరతాబాద్ సర్కిల్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36, నీరూస్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించడంపై తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు జగ్గా రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గంట కూడా గడవకముందే తొలగించడం అత్యంత విచారకరం, సిగ్గుచేటని యాదవల్లి వెంకటస్వామి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? లేక ప్రతిపక్షంలో ఉందా? అనే సందేహం కలిగేలా కొందరు అధికారుల వ్యవహార శైలి ఉందని ఆయన విమర్శించారు. కొందరు నాయకులకు ఒక విధంగా, కాంగ్రెస్ నాయకులకు మరో విధంగా వ్యవహరించడం ఎందుకు? ఈ వివక్షకు కారణమేంటని ఆయన ప్రశ్నించారు.

ఒకవైపు కొందరు నాయకుల కార్యక్రమాలకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా అవకాశం కల్పిస్తూ, మరోవైపు కాంగ్రెస్ నాయకుల జన్మదిన ఫ్లెక్సీలను గంట కూడా గడవకముందే తొలగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఫ్లెక్సీలను ఏ కారణంతో తొలగించారో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

Also Read-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X