తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జోసెఫ్‌కు హార్దిక శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ నటుడు విజయ్ జోసెఫ్ కి కు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమిళనాడులో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జోసెఫ్‌తో పాటు నూతన మంత్రివర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ప్రజా సంక్షేమ పథకాలపై తొలి సంతకం చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షించారు.

Also Read-

యువతకు ప్రేరణగా నిలిచిన నాయకుడు రాజకీయాల్లోనూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరమని పేర్కొంటూ తెలంగాణ–తమిళనాడు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.

తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించాలని కోరుతూ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X