డూప్లికేట్ మరియు కర్నాటక ఓట్లతో కొడంగల్ లో రేవంత్ రేడ్డీ గెలుపు : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు ఉన్నారంటూ సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచారు. ఇతర దేశాల వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండొద్దనటం సరే గానీ ఇతర రాష్ట్రాల వాళ్లు ఒక్కొక్కరూ రెండు మూడు స్టేట్ లలో ఓటు వేయవచ్చా అని ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల ఏరివేతకు ఈసీ వద్ద ఉన్న మెకనిజం ఏంటో చెప్పాలన్నారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను నియంత్రిచకపోతే ఎస్ఐఆర్ తో ప్రయోజనం లేదన్నారు.

రేవంత్ రెడ్డికి ఈసీ ఫేవర్ చేసిందా?

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తన నియోజకవర్గమైనా భోదన్ లో ఓట్ల జాబితా చూస్తే ఏడు వేల ఓట్లను తొలగించిన విషయం తెలిసిందని కవిత చెప్పారు. అసలు ఈ ఏడు వేల ఓట్లు షిప్ట్ అయ్యాయా? వాళ్లు చనిపోయారా? ఏంటన్న కారణం మాత్రం ఈసీ చెప్పటం లేదని కవిత మండిపడ్డారు. ఒక నియోజకవర్గంలో 2 శాతానికి మించి ఓట్లు తొలగించాలంటే ఎవరివైతే ఓట్లు తొలగిస్తారో వారికి మూడు సార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ రూల్స్ లోనే ఉందని గుర్తు చేశారు. 7 వేల ఓట్లు అంటే అవి ఒక అభ్యర్థి విజయాన్ని నిర్ణయించే పెద్ద మొత్తంలో ఓట్లనీ చెప్పారు. ఐతే అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందా? అని తెలుసుకునేందుకు కొడంగల్ నియోజకవర్గం లో జాబితాను చెక్ చేస్తే ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయని కవిత అన్నారు.

2018 నుంచి 2023 నాటి ఎన్నికల వరకు కొడంగల్ లో 30 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయని చెప్పారు. అక్కడ దాదాపు గా 22 వేలకు పైగా ఓట్లు డూప్లికేట్ ఉన్నాయని తాము గుర్తించామన్నారు. అవి కాకుండా కర్ణాటకకు చెందిన సెడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పారు. అంటే దాదాపుగా 33 వేల ఓట్లు అక్రమంగా ఉంటే అక్కడ 8 వందల ఓట్లు మాత్రమే తొలగించారని చెప్పారు. రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీ తో గెలిచారని కవిత గుర్తు చేశారు. అంటే డూప్లికేషన్, పక్క రాష్ట్రం ఓట్లు రేవంత్ రెడ్డిని గెలిపించినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

Also Read-

ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఈసీ ఫేవర్ చేసిందా అనే అనుమానం కలుగుతుందని కవిత అన్నారు. భోదన్ లో ఏడు వేల ఓట్లు తొలగిస్తే…కొడంగల్ లో మాత్రం 8 వందల ఓట్లు మాత్రమే తొలగించారని చెప్పారు. అదే విధంగా లక్ష ఓట్ల వరకు కొడంగల్ లో మోడిఫికేషన్ జరగటం కూడా అనుమానాలకు తావిస్తుందన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి డబ్బు మాత్రమే కాకుండా ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.

ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్ల సంగతేంటీ?

అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ కు ప్రయోజనం ఉండాలంటే ప్రధానంగా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను తొలగించాలని కవిత అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన దేశంలో ఇతర దేశస్తులకు ఓట్లు ఉండవద్దని చెబుతున్నారని.. దాన్ని టాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఒక వ్యక్తికి రెండు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉండవచ్చా అని ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ లాంటి యాక్టర్ కు రెండు మూడు స్టేట్ ల లో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని గుర్తు చేశారు. అసలు ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లు తొలగించేందుకు ఈసీ వద్ద ఉన్న మెకనిజం ఏంటనీ కవిత ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ఓట్లను తొలగించకపోతే ఇతర దేశస్తులు ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ జరుగుతుంటే మరో రాష్ట్రంలో వాళ్ల ఓట్లను నమోదు చేసుకోరా అని కవిత ప్రశ్నించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానం ఉండాలని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్ పర్మినెంట్ సొల్యుషన్ కావాలి

ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్ కావాలని కవిత అన్నారు. ఎస్ఐఆర్ కోసం సాధారణంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాల్సి ఉండగా ఈసీ మాత్రం గతేడాది జనవరి 1 నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుందని అన్నారు. ఈ ఏడాదిన్నరలో చాలా నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్లు తొలగించినట్లు తెలుస్తుందని చెప్పారు. దీనిపై మీద ఈసీ దృష్టి పెట్టాలని కవిత కోరారు. అదే విధంగా ఒక కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే బూత్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లు తీసేస్తేనే ఎస్ఐఆర్ ప్రయోజనం ఉంటుందని ఆమె అన్నారు. అదే విధంగా తాము లేవనెత్తిన అన్ని అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X