నాపై ఆరోపణలకు విచారణకు సిద్ధం, నేను చేస్తున్న ఆరోపణలై KTR సిద్ధమా?: రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్ : నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం, మీ పై, మీ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లంచ్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.

“భూమి తల్లితో సమానం. సాయుధ రైతాంగం పోరాటం, 1969లో తెలంగాణ ఉద్యమం భూముల కోసమే జరిగింది. ధరణి వ్యవస్థను తీసుకొచ్చి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో నిజాం ముందు నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను డ్రామారావు, మిత్ర బృందం కొల్లగొట్టింది. వారి మాట వినే కలెక్టర్ల ద్వారా భూ దోపిడికి పాల్పడ్డారు. నేను భూదందాలకు పాల్పుడుతున్నా అని కేటీఆర్ ఆరోపణ చేశారు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం.

అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లో జరిగిన భూ లావాదేవీలపై, 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ అంటే నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఎన్నివేల ఎకరాల భూములను ఆ జాబితా నుంచి తొలగించారు ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలి అని కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. అమెరికన్ కంపెనీని బెదిరించి తెల్లపూర్ లోని 100 ఎకరాల రూ. 5 వేల కోట్ల విలువైన భూములను రూ.260 కోట్లకే ప్రతిమ శ్రీనివాస్ పేరిట బదలాయించారు. అందులో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందుకో కేటీఆర్ కు భాగస్వామ్యం ఉంది.

బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్రా నేత తోట చంద్రశేఖర్ కు మియాపూర్లో ఎకరాం 100 కోట్లు ఉండే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టింది. మియాపూర్లో సర్వే నెంబర్ 80లో రూ. 500 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి ఏవిధంగా వచ్చింది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమి బదిలీ కోసమే రెడ్యా నాయక్ ను పార్టీ మార్పించింది వారి కూతురు కవిత. కూతురు భూ దాహం కోసమే రెడ్యా నాయక్ పార్టీ మారారు. కవిత గారు ఈ విషయంపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా.

మీ పై, మీ ప్రభుత్వంపై నేను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉండాలి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ కొడుకు చేసే భూ దందాలు కనిపించడం లేదా? దృతరాష్టుడిలా కళ్లు మూసుకున్నారా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకం. మేం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

అక్రమాలకు పాల్పడిన సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్ లను జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర తెలంగాణలో రాక్షస పాలన అందిస్తూ, దోపిడీలు చేస్తున్న పాపాల భైరవుడైన కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా నర్సింహులుపేట మండలం నాగారం నుంచి మర్రిపెడబంగ్లా వరకు దాదాపు 11 కిలోమీటర్ల వరకు నాలుగో పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం మర్రిపెడబంగ్లాలో నిర్వహించిన జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో బీజేపీ సాగిస్తున్న విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జాతి సమైక్యత కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకూమారి నుంచి కాశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. డోర్నకల్ లో 14 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిన చరిత్ర ఈ గడ్డది.

“రాష్ట్రంలో కేసీఆర్ దోపీడి చేస్తుంటే ఇక్కడ రెడ్యానాయక్ నయా జమీందారుగా తయారై ప్రజలను పీడిస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, కూతురో దిక్కు దోచుకుంటున్నారు. అకేరు, మానేరు, పాలేరు వాగుల్లో ఇసుక దందా మొత్తం వాళ్లదే. మిల్లర్ల రూపంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా దోచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఏవీ ముందుగా వారి కుటుంబానికి నైవేద్యం పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇవాళ నియోజకవర్గంలో నెలకొన్న దుస్థితికి రెడ్యానాయక్ కుటుంబమే కారణం ” అని రేవంత్ రెడ్డి అన్నారు.

అందుకే వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్ ఓడించాలని మా యువకులు ఇక్కడకు వచ్చారని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా వీఆర్ఏలు, ఐకేపీ సంఘాల వారిని, రైతులు, విద్యార్ధులు, గిరిజనులు, ఉపాధ్యాయుల తదితరుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అవినీతి కారణంగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఐకేపీ సంఘాలకు దిక్కులేదు. వీఆర్ఏ లకు అసెంబ్లీ సాక్షిగా తండ్రికొడుకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు గోస పడుతున్నారు.

గురుకుల టీచర్లకు చాలీ చాలని జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతుల గోస ఇక వర్ణనాతీతం. డబుల్ బెడ్రూం ఇళ్లను మధ్యలోనే ఆపేశారు. ఆయన గడీని తొమ్మిది నెలల్లో కట్టుకున్న కేసీఆర్… నాలుగేళ్లయినా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందన్నారు. “నిన్న మహబూబాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడిరంట. కనుసైగ ఆ ఎమ్మెల్యే కనుసైగ చేస్తే నేను మర్రిపెడ కూడా దాటనంట. ఆ ఎమ్మెల్యేకు చెప్పదలుచుకున్నా.

నీతోని కాదుగానీ.. ఏట్లో రావులందరిని తీసుకునిరా.. మరిపెడ చౌరస్తాలో నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలు పేరు మార్చుకుంటారని” అని బీఆర్ఎస్ నాయకులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గూడు నుంచి గుడుంబా వరకు ఎమ్మెల్యే కుటుంబమే దందాలు చేస్తే అంతకుమించిన దౌర్భగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ప్రగతి భవన్ లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదు..? ప్రగతి భవన్ గుడుపుఠాని ఏందీ? అందులో వేల కోట్ల కథ ఏందీ? పేదల చెమట వాసనకంటే కాంట్రాక్టర్ల సెంటు వాసన కేసీఆర్ కు ఇంపుగా ఉందా? మళ్లీ చెబుతున్నా.. ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలుకొడతామని అన్నారు.

ఎన్ని వందల కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నువ్వు శాశ్వతం అనుకున్న గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ప్రగతి భవన్ ను డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తాం. పోలీసులను నమ్ముకుని నేను పాదయాత్ర చేయడం లేదు. మా కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకుని యాత్ర చేస్తున్నా. ధరణి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు, పంటకు గిట్టుబాటు ధర, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కావాలంటే కేసీఆర్ పోవాలి.

ఈ ప్రాంతంలో కురవి వీరభద్ర స్వామి ఉంటారు. ఆ దేవునికి బంగారు మీసాలు చేయిస్తా అని ఉద్యమకాలంలో కేసీఆర్ మాటిచ్చాడు. కానీ తర్వాత ఇచ్చిన అవి బంగారం కాదు నకిలీ మీసాలు అని తేలింది. ఈ విధంగా దేవుళ్లను, డోర్నకల్ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ గద్దె మీద ఉండటానికి అర్హుడా అని ప్రశ్నిస్తున్న. రాష్ట్రంలో అన్నీ సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ రావాలి. ఈదిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని యువకులకు రేవంత్ రెడ్డి పిలుపినిచ్చారు. సభ తర్వాత కురవి వీరభద్ర స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.

Prepare for the Investigation of the Allegations Against me.. Is KTR Ready for the Allegations I am Making?: Revanth Reddy

Hyderabad : President of TPCC Revanth Reddy said no matter what the allegation is against him, he is ready for trial with the sitting judge and challenged Minister KTR to be ready for trial with the judge on the allegations he is making against him and his government. He spoke to the media at the Dornakal lunch point in the Mahabubabad district as part of Hath Se Hath Jodo Padayatra. “Earth is equal to mother. The armed peasant struggle, the Telangana movement in 1969 was for land. Bringing the Dharani system, Drama Rao and his friends looted the lands owned by the government since before the Nizam in Rangareddy, Sangareddy and Medchal districts.

The land robbery was committed using the collectors who listen to them. KTR alleged that I am involved in land grabbing. I am ready to be tried by the sitting judge whatever the charge is against me. Similarly, I am challenging KTR to investigate with a sitting judge the land transactions in Sangareddy, Rangareddy and Medchal districts from 2014 to now, and how many thousands of acres of land have been removed from the 22A i.e. prohibited list by the Congress government from 2004-14 and on whoseever names these lands have been transferred to. 100 acres of lands in Tellapur worth Rs. 5 thousand crores were transferred in the name of Pratima Srinivas for Rs.260 crores, threatening the American company. And Thousands of crores of business are done with it.

KTR has a share in it. 50 acres of government land worth 100 crores per acre has been allotted to Andhra BRS party leader Thota Chandrasekhar in Miyapur. In Miyapur Survey No. 80, from where did 5 acres of land worth Rs.500 crores come? This is government land. Redya Naik’s daughter Kavitha got him to change the party only for the transfer of this land. Redya Naik changed party only for his daughter’s thirst for land. Kavitha is throwing a challenge to come to a discussion on this matter. KTR should be ready to be investigated by the sitting judge on the allegations I am making against him and his government,” said Revanth Reddy.

Doesn’t KCR see his son’s land encroachment? He asked Chief Minister KCR whether he closed his eyes like a Dhritarashtra. Congress party is against the rule of Gadis. Revanth Reddy stated that if we come to power, Pragati Bhavan will be converted into Dr. BR Ambedkar Knowledge Centre. Congress will come to power in the next 10 months. Revanth Reddy said that Congress will take the responsibility of sending Sangareddy, Medchal and Rangareddy collectors, who have committed illegalities to jail.

This Yatra is to End KCR’s Misrule

President of TPCC Revanth Reddy said that this yatra is being done to trample KCR, who committed sins, who is ruling like a demon in Telangana, to the underworld. As part of the Hath Se Hath Jodo Yatra, the fourth-day padayatra was conducted from Nagaram in Narsimhulupeta Mandal to Marripedabangla for about 11 kilometres. Later, Revanth Reddy addressed the public meeting held at Marripeda Bangla. Rahul Gandhi walked 4 thousand kilometres from Kanyakumari to Kashmir for national integration, against the destructive rule of the BJP in the country. Historically, the Congress flag was hoisted in 12 out of 14 elections held in Dornakal.

Revanth Reddy criticized that while KCR is looting in the state, here Redyanaik has become a new landlord and is oppressing the people. Father, son and daughter are looting the state left, right and centre. The entire sandbank in Akeru, Maneru and Paleru streams belongs to them. Through millers, they are looting the paddy cultivated by farmers. In this region, there are situations to make an offering to their family first. Revanth Reddy said that Redyanayak’s family is the reason for the current situation in the constituency.

That is why our youths have come here to defeat Redyanayaek in the next election, he said to the audience. He said that as part of the padayatra, he got to know the problems faced by VRA, IKP associations, farmers, students, tribals, teachers etc. and also saw the double-bedroom houses which were stopped in the middle due to corruption. IKP associations do not have hope in the state. Father and son did not keep their promise made to the VRAs in the house of the assembly. Farmers are suffering due to a lack of proper remunerative prices for chilli crops. Teachers have expressed concern that they aren’t being paid well.

The plight of cotton farmers is indescribable. Double-bedroom houses were stopped in the middle. He slammed the government for not completing the double-bedroom houses even after four years while KCR built his gadi in nine months. He said that there is a need to trample such KCR government to the bottom of the earth. “The MLA and MP spoke about the comments made in Mahabubabad yesterday. The MLA said that if he winks, I will not even cross the border. I want to tell that MLA, bring any number of people, and we will trample them all and cross the Maripeda square, warned Revanth. I am asking whether there will be more misery if the MLA’s family itself does business from houses to arrack. Why is there no entry for people in Pragati Bhavan..? What is Pragati Bhavan’s secret? What is the story of thousands of crores? Is the smell of contractors’ Scents more appealing to KCR than the smell of poor people’s sweat? He said that the gates of Pragati Bhavan will be broken.

You can file how many ever cases you want to file. We will hoist the Congress flag on the gadi that you thought was permanent. Pragati Bhavan will be converted into Dr. BR Ambedkar Science Centre. I am not going on a yatra trusting the police. We are doing the yatra with faith in our Congress workers. If Dharani problems are to be resolved, Indiramma houses, Rs. 5 lakhs for construction of houses, affordable price for the crop, fee reimbursement arrears, Arogya Sri arrears, investment assistance to tenant farmers, KCR should go.

Kuravi Veerabhadra Swamy resides in this area. KCR said during the movement that he will make a golden moustache for that god. But later it turned out that they were fake moustaches and not gold. It is being questioned whether KCR, who cheated the gods and the people of Dornakal in this way, deserves to be on the throne. Congress should come to solve all the problems in the state. Revanth Reddy appealed to the youth to sensitize people in this direction. After the meeting, Revanth Reddy visited Kuravi Veerabhadra Swamy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X