हैदराबाद: तेलंगाना की राजनीति में एक और नई पार्टी सामने आई है। कविता ने घोषणा की है कि वह तेलंगाना राष्ट्र सेना (TRS) नाम से एक नई पार्टी बना रही हैं। कविता ने 25 अप्रैल को मेडचल जिले के मुनिराबाद में हुई पार्टी की गठन बैठक में पार्टी के नाम की घोषणा की। कविता का अपनी पार्टी का नाम तेलंगाना राष्ट्र सेना (TRS) रखने का फैसला, जो उनके पिता KCR द्वारा बनाई गई तेलंगाना राष्ट्र समिति (TRS) जैसा ही है। यह नाम इस समय राज्य की राजनीति में चर्चा का विषय बन गया है।
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. శనివారం (ఏప్రిల్ 25) మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఈ మేరకు కవిత పార్టీ పేరును అనౌన్స్ చేశారు. గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరహాలోనే కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా తన పార్టీ పేరు నామకరణం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్.. అనేది ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాత పేరు. తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ ప్రారంభించిన పార్టీ. ఈ పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమం నడిపించారు కేసీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్లు ఈ పార్టీ పేరుతో కేసీఆర్ రాజకీయం చేశారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత అప్పట్లో తండ్రి ప్రారంభించి వదిలేసిన టీఆర్ఎస్ పేరుతోనే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టటం విశేషం. కాకపోతే అప్పట్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. మారింది జస్ట్ సమితి ప్లేస్ లో సేన వచ్చింది. మిగతాది అంతా సేమ్ టూ సేమ్.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుదూ మన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ది జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో ఇదొక మరుపురాని రోజు. మనందరం కలుసుకొని పనిచేసే విధంగా ఆ దైవం చేసిందని నమ్ముతున్నా. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, అనేక రకాల కష్టాలు పడిన, రాష్ట్ర వస్తే చాలని భావించిన వాళ్లకు నమస్కారం. సింగరేణి కార్మికులంటే ఇష్టం, అంతకన్నా ఆడబిడ్డలంటే ఇంకా ఇష్టం. జెన్ జీ వారసులు, యూత్ కు పేరు పేరున నమస్కారం.
