గాంధీ భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు, టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ…

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి సేవాదల్ చీఫ్ జితేందర్, ఫిషెరీస్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 1948 వరకు మన సంస్థానం కి స్వతంత్రం రాలేదు. దూర దృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ పంపి దేశంలో విలీనం చేయించారు.

బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుంది. తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదు. అనాడు ఉన్న ఇప్పటి బీజేపీ అనుబంధ సంఘాలు బ్రిటిష్ కి వంతపాడారు. వల్లభాయ్ పటేల్ కి బీజేపీ కి సంబంధం ఏంటి. వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ తన నాయకునిగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీ కి లేదు

కాంగ్రెస్ వల్లనే స్వతంత్రం వచ్చింది. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యింది. పదేళ్లు తెలంగాణ నీ తుంగలో తొక్కారు కేసీఆర్. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐటి రంగాన్ని దేశంకి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. చదువుకున్న అనుకుంటున్న కేటీఆర్ కి సంస్కారం లేదు. సంస్కారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా? తెలంగాణ తల్లిని గౌరవించాలని. సెక్రటేరియట్ గుండెల్లో విగ్రహం పెడుతుంది ప్రభుత్వం.

Also Read-

బీజేపీ పెట్టే చిచ్చులో పడదామా? కాంగ్రెస్ ఇచ్చే సంక్షేమ పథకాలు పొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుద్దామా? ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరు ఎంత ఉంటే వారికి అంత వాటా అని రాహుల్ గాంధీ చెప్పారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X