హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు MP రాహుల్ గాంధీ పై మహారాష్ట్ర షిండే గ్రూప్ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ( రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తీసుకువస్తే 11 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తా) అంటూ చేసిన అనుచిత వ్యాఖ్య లకు నిరసన గా NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి ఆధ్వర్యం లో లిబర్టీ సర్కిల్, అంబేద్కర్ విగ్రహం వధ దిష్టి బొమ్మా దహనం చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఈ దేశం లో రిజర్వేషన్లు లేకుండా చెయ్యాలి అని చూసిన BJP మరియు వాటి కూటమి పార్టీలు ఇప్పుడు కావాలని రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వాక్యాలను ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50% కన్నా రిజర్వేషన్ లు ఎక్కువ ఇస్తామని చెప్పారు.
వాషింగ్టన్ డిసి లో మాట్లాడిన మాటలకు రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం వివరణ కూడా ఇచ్చారు. తన చేసిన వాక్యాలను ఇతర పార్టీ వాళ్ళు కావాలని తప్పుగా వక్రీకరించి చూపిస్తున్నారు అని అన్నారు. కానీ బిజెపి మిత్రపక్షం అయన మహారాష్ట్ర శివసేన mla గైక్వాడ్ని అడ్డం పెట్టుకొని కావాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంజయ్ గైక్వాడ్ ను తక్షణమే శిక్షించాలి అని తెలంగాణ NSUI విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది.
Also Read-