రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చాదర్ పంపారు
మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనార్టీ నాయకులకు అందజేసిన కవిత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్ లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ (ర.అ.) దర్గాను దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటానని చాదర్ సమర్పించాను. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, ఖ్వాజా గరీబ్ నవాజ్ సహా ఆ దేవుళ్ల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అజ్మీర్ దర్గాకు వెళ్లి మొక్కు చెల్లించుకున్నాను.

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి ఆవిర్భవించబోతున్న నేపథ్యంలో ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు చాదర్ పంపుతున్నాము. తెలంగాణ జాగృతి మైనార్టీ నాయకులు అజ్మీర్ కు వెళ్లి ఈ చాదర్ ను సమర్పిస్తారు.
ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలు వెళ్లివిరియాలని కోరుతున్నాము.
