హైదరాబాద్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.
అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన దళితవాడలో బ్లడ్ క్యాంప్ మరియు దళిత వాడలో భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రదేశ్ కమిటీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం అందించిన గొప్ప మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కొనియాడారు. తన కలంతో భారత రాజ్యాంగాన్ని రచించి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహానీయుడు అంబేద్కర్ గారిని తెలియజేశారు.
Also Read-

కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మల్లిపేది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ 297 298 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంస్థల చైర్మన్లు అనుబంధ సంస్థల చైర్మన్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
