38 వ జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ కంటింజెంట్ బృందానికి ఆల్ ది బెస్ట్
పోటీల్లో పాల్గొంటున్న 22 క్రీడలకు సంబంధించిన 218 మంది ఆటగాళ్లు
హైదరాబాద్ : 38వ జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణ కంటింజెంట్ కి డిప్యూటీ చీఫ్ డిమిషన్ గా వ్యవహరిస్తున్న కే మహేశ్వర్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల బృందంతో పాటు మహేశ్వర్ కి టిపీసీసీ చీఫ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పోటీల్లో ఆటగాళ్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. పాయింట్ల పట్టికలో తెలంగాణ ముందంజలో ఉండాలని కోరారు.
Also Read-
ఉత్తరాఖండ్ లో ఈనెల 28 నుండి ఫిబ్రవరి 14 వరకు పోటీలు జరగనున్నాయి. రాష్ట్రం నుంచి 22 క్రీడలకు సంబంధించిన 218 మంది ఆటగాళ్లు ఆయా విభాగాల్లో పోటీపడబోతున్నారు. ఈ పోటీల కోసం 11 మంది ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఆటగాళ్లతో కలిసి వెళ్లనుంది.