“జ్ఞాన చైతన్య బస్సు యాత్ర”ను జెండా ఊపి ఘనంగా ప్రారంభించిన ఎంపీ మల్లు రవి, ఆయనా మాట్లాడుతూ…

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధన లక్ష్యంగా చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర”ను జెండా ఊపి ఘనంగా ప్రారంభించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి.

ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఇది కూడ చదవండి-

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సరితమ్మ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X