హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఈరోజు సీతాఫల్‌మండి – లాలాగూడ మధ్య నూతనంగా నిర్మించి ప్రారంభించిన కార్డ్-లైన్‌ను సవివరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ మరియు ప్రధాన కార్యాలయం, డివిజన్‌కు చెందిన ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఆయనతో పాటు ఉన్నారు.

సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు సీతాఫల్‌మండి స్టేషన్‌నుండి తనిఖీని ప్రారంభించి స్టేషన్ పరిసర ప్రాంతం, స్టేషన్ ప్రాంగణం, స్టేషన్ పరిశుభ్రత, వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫారమ్‌లను తనిఖీ చేసి, స్టేషన్‌లో అందుబాటులోనున్న ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఆయన స్టేషన్ మాస్టర్ గదిని కూడా తనిఖీ చేసి, స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ మరియు భద్రతా పరికరాలను పరిశీలించారు.

Also Read-
అంతేకాకుండా, జనరల్ మేనేజర్ కొత్తగా నిర్మించి, ప్రారంభించిన సీతాఫల్‌మండి – లాలాగూడ కార్డ్ లైన్ సెక్షన్‌లో ట్రాలీ తనిఖీ నిర్వహించారు. ఆయన నూతనంగా ప్రారంభించిన ఈ లైన్‌లోని పాయింట్లు, క్రాసింగ్‌లను కూడా పరిశీలించారు. కొత్తగా ప్రారంభించిన ఈ మార్గం, సికింద్రాబాద్ స్టేషన్‌ను దాటుతూ (బైపాస్ చేస్తూ) సికింద్రాబాద్ – కాజీపేట ప్రధాన మార్గాన్ని సికింద్రాబాద్ – డోన్ మార్గంతో కలుపుతుంది.

కొత్తగా ప్రారంభించబడిన కార్డ్-లైన్ యొక్క ముఖ్య విశిష్టతలు:
ఈ లైన్ దూరం సుమారు 3 కిలోమీటర్లు.
ఈ లైన్ నిర్మాణంలో భాగంగా 5 చిన్న వంతెనలు నిర్మించబడ్డాయి.
ఈ మార్గంలో ‘అలుగడ్డ బావి రోడ్డు అండర్ బ్రిడ్జ్ ప్రధాన వంతెన.
ఈ సెక్షన్లో పూర్తి ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది.
ఇప్పటివరకు, సికింద్రాబాద్‌ను దాటుతూ (బైపాస్ చేస్తూ) కాజీపేట నుండి కాచిగూడకు వచ్చే రైళ్లు సాధారణంగా దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలా – అలీ, మల్కాజిగిరి మీదుగా కాచిగూడకు చేరుకునేవి .
ఈ లైన్ ప్రవేశపెట్టడంతో దూరం, ప్రయాణ సమయం రెండూ గణనీయంగా తగ్గుతాయి. కాజీపేట నుండి రైళ్లు లాలాగూడ మీదుగా నేరుగా కాచిగూడకు చేరుకుంటాయి, అలాగే లాలాగూడ నుండి కాజీపేటకు కూడా చేరుకుంటాయి. దీనివల్ల దూరం దాదాపు 12 కిలోమీటర్లు , ప్రయాణ సమయం సుమారు 20 నిమిషాలు తగ్గుతుంది.
ఈ కొత్త కార్డ్ లైన్ లాలాగూడ నుండి ప్రారంభమై, సీతాఫల్‌మండి ‘A’ క్యాబిన్ మరియు సీతాఫల్‌మండి ‘B’ క్యాబిన్ల మీదుగా వెళ్లి సీతాఫల్‌మండి స్టేషన్ వద్ద కలుస్తుంది.

ఇంకా, సంజయ్ కుమార్ శ్రీవాస్తవ లాలాగూడ స్టేషన్, సిగ్నలింగ్ మరియు భద్రతా పరికరాలను తనిఖీ చేసి, స్టేషన్ మాస్టర్‌తో సంభాషించారు.
