హైదరాబాద్ : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) ఆదేశాల మేరకు “సమృద్ధి కోసం నిజాయితీ (Probity for Prosperity)” అనే ఇతివృత్తంతో 17 ఆగస్టు నుండి 16 నవంబర్ వరకు మూడు నెలల పాటు విజిలెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా “పరిశ్రమల్లో విజిలెన్స్ పరిపాలన” అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్‌ను 27 ఆగస్టు న డా. ఎస్. వి. ఎస్. నారాయణ మూర్తి, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మిధాని ఆధ్వర్యంలో నిర్వహించారు.

ప్రారంభ కార్యక్రమానికి అజయ్ కుమార్ వర్మ, IDSE, డైరెక్టర్, CVC; పి. కృష్ణ కుమార్, ITS, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ECIL; సి. నీలకంఠ రెడ్డి, IRSSE, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, NMDC; శ్రీమతి కె. మధుబాల, డైరెక్టర్ (ఫైనాన్స్); పదవిట్టన్ బాబు, డైరెక్టర్ (ప్రొడక్షన్ & మార్కెటింగ్); శ్రీమతి స్ఫూర్తి రెడ్డి, IRS, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మరియు ECIL, NMDC, BDLలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, మిధాని ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిధాని చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ “ఉద్యోగుల అంతర్గత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కోసం ఈ-ప్లాట్‌ఫారమ్”ను ప్రారంభించారు.

వర్క్‌షాప్‌లో “2026లో విడుదలైన CVC మాన్యువల్ తాజా సంచికలో మరియు సంబంధిత మాస్టర్ సర్క్యులర్లలో చేసిన మార్పులు” మరియు “వివిధ సంస్థలు చేపట్టిన ప్రభావవంతమైన విజిలెన్స్ కార్యకలాపాలు” అనే అంశాలపై సదస్సులు నిర్వహించబడ్డాయి. వర్క్‌షాప్ ధన్యవాద తీర్మానంతో ముగిసింది.

Also Read-





One thought on “పరిశ్రమల్లో విజిలెన్స్ పరిపాలనపై వర్క్‌షాప్”