మిత్రులకు 19 లక్షల కోట్లు దోచి పెట్టారు, నల్లగొండ జిల్లా కేంద్రం నుండి మోదీ మోసం బట్టబయలు

మిత్రులకు 19 లక్షల కోట్లు దోచి పెట్టారు
పేదల కడుపులు కొట్టి పెద్దలకు పంచుతున్నారు
ఆ సొమ్మంతా తెలంగాణా ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ములే
బిజెపి వంచన చేరిన రాహుల్
గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి ఎగనామం అందులో భాగమే
క్రూడ్ ఆయిల్ ధరలు ఏనాడు 100 డాలర్లకు మించలేదు
అయినా ఆకాశానికి అంటిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు
దేశం యావత్ బి ఆర్ యస్ వైపే
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్ర్య నిర్మూలన
కేంద్రం పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
పెరిగిన గ్యాస్ ధరలపై భగ్గుమన్న నారీ లోకం
నల్లగొండలో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో మహిళల భారీ ప్రదర్శన
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
పాల్గొన్న జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరులు

హైదరాబాద్ : ప్రధాని మోదీ మోసం బట్టబయలు అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారత దేశంలో ప్రజల నుండి వసూలు చేస్తున్న సొమ్మునంతా ఆయన దగ్గరి మిత్రులకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు.పేదల కడుపు కొట్టి పెద్దలకు పంచుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును ఆదాని, అంబానీ లకు దోచి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజారిటీ మొత్తం తెలంగాణా ప్రజల సొమ్మే నని ఆయన తెలిపారు.

కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచాడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఖాళీ సిలిండర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్ద గడియారం చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,పట్టణ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్న

ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయంతో పాటు వ్యాపార, వాణిజ్య గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా తో పాటు, కళ్యాణాలక్ష్మీ/షాది ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో ప్రజల నోళ్ళలో నిత్యం నానుతున్నారన్నారు .అదే సమయంలో ప్రధాని మోడీ పేరు ను కుడా ప్రజలు నిరంతరం స్మరిస్తున్నారన్నారు.

మోదీ ప్రధానిగా ఎన్నికయిన రోజున 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 1200 కు పెరగడమే మోదీ ని ప్రజలు గుర్తుంచుకోవడానికి కారణమైందని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడూ… ఇప్పుడూ 100 డాలర్లే నన్నారు. అటువంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమెందని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బిజెపి వంచన చేరారని ఆయన దుయ్యబట్టారు. ఇద్దరు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. గుజరాత్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి రాహుల్ గాంధీ ఎగనామం పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. అంతెందుకు మునుగోడు లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు భారత జోడో యాత్ర పేరుతో తెలంగాణాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మునుగోడు ఎన్నికల ప్రచారానికి రాక పోవడం వెనుక దాగి ఉన్న మర్మం కుడా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కి ఉన్న సంబంధాలే కారణమన్నారు.

యావత్ భారతదేశం బి ఆర్ యస్ వైపే చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్ర్య నిర్ములన జరుగుతుందన్న విశ్వసనీయత దేశ ప్రజల్లో బలంగా పెరిగిందన్నారు.పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X