వెంటనే పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం తేవాలంటూ అంబేద్కర్ వర్షీటీలో ఉద్యోగుల ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ : పెండింగ్ లో ఉన్న పి.ఆర్.సి. కి ఆమోదం తెలపాలి, పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డ్‌లు, పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (తుంటీయ), తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు గురువారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల సభ్యులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి పి.ఆర్.సి. వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్.) ప్రవేశ పెట్టాలని, ఉద్యోగులు వారి కుటుంభ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగేలా హెల్త్ కార్డ్‌లు జారీ చేయాలని, దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో తుంటీయ సెక్రటరీ జనరల్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, తుంటియా వర్కింగ్ ప్రెసిడెంట్ డా. యకేష్ దైడా, విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం సభ్యులు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, కె. మంజుల, జి. జ్యోతీ శ్రీ,, రజనికాంత్, మహమ్మద్ షబ్బీర్; సుహాసిని అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X