Muttineni Veeraiah
చైర్మన్ -కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం
చైర్మన్, వికలాంగుల కార్పొరేషన్, తెలంగాణ
మీరూ Mic Tv ఇంటర్వ్యూ లో ఫో. కోదండరాం, ఫో. నాగేశ్వర్ రావ్, జయ ప్రకాష్ నారాయన్ పేర్లు ప్రస్తావన చేయని మరో ఇద్దరినీ ఉద్దేశిస్తూ కాళేశ్వరంపై మాట్లాడిన సందర్బంలో…
నా జాతి అంధులును, వారీ శక్తి సామార్ధ్యలను అవహేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడారు. కించపరిచే విదంగా మాట్లాడారు. మా మనో భావాలు దెబ్బ తీసేలా మిమ్మల్ని ఆదర్శం గా తీసుకోని మరీ కొందరు వాళ్ళ కి నచ్చని వ్యక్తులను కించపరిచే విధానం లో మమ్మల్ని అవమానించే పదాలు వాడే ప్రమాదం ఉంది.
మీరూ ఇలా మాట్లాడటం వికలాంగుల హక్కుల చట్టం -2016,సెక్షన్ -92 ప్రకారం నేరం. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా , కోర్టు ఉత్తర్వులు, పార్లమెంట్ లో ఆమోదం పొందిన వికలాంగుల హక్కుల చట్టం -2016 స్పష్టంగా గుడ్డి, మూగ, అవిటి, కుంటి ఇలా అంగవైఖల్యం ను ఎత్తి చూపే మాటలు మాట్లాడవద్దు అని చెప్పింది.
మీ మాటలు వికలాంగుల హక్కుల పై మీ మాటలు గొడ్డలి మోపేలా ఉన్నాయి. ఇదేనా. .??? మీ మేధావి తనం. .??? మేము మనుషులమే మీ కంటే ఎక్కువ పని చేయగలం. అందుల అక్షర ప్రదాత లూయిస్ బ్రేయిలి గురించి మీకూ తెలుసా? 6 చుక్కలు తో ప్రపంచంలో ఏ బాష లోనైనా మాట్లాడవచ్చు, చదవ వచ్చు. ఏరిక్, హాంగ్, జెమి వీళ్ళు ఎవరెస్టునీ అధిరోహించిన అంధులు.
Also Read-
ఈ ప్రపంచంలో సకలాంగులు సైతం సాధించని ఎన్నో విజయాలు మా జాతి బిడ్డలు సాధించారు. ఇంతకుముందు మీ నాయకుడు KCR (కుంటోళ్ళు, గుడ్డో ళ్లు, మరగుజ్జులు అనే పదాలు వాడారు) KTR ప్రతిపక్షం నేతలని ఉద్దేశిస్తూ మరగుజ్జులు అని మాట్లాడి మరగుజ్జులును కించపరిచారు. మీ అందరికి ఇది అలవాటుగా మారింది.
మీకూ ఏ మాత్రం అయినా మానవత్వం ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పండి లేదు అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లలో మీపై వికలాంగుల హక్కుల చట్టం క్రింద కేసులు పెడతాం, మిమ్మల్ని తెలంగాణలో తిరగనివ్వం.
