జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటు. ఒకే కేసులో ఇది వరకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఇప్పుడు మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం.



తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

Also Read-


తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు.. తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదు. తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలి. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇస్తున్న.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X