హైదరాబాద్ : జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులు, వైద్య సిబ్బందికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనపెట్టి అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు సమాజానికి నిజమైన దేవుళ్లని కొనియాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు.
Also Read-
రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ప్రతి వైద్యుడి సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగం, సేవాస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, అది మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులు మరింత ఉత్తమ సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ, అభినందనలు పొందాలని ఆకాంక్షిస్తూ, ప్రతి వైద్యుడికి మరోసారి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
