హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బోదనేతర సంఘాల సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల ఉన్న విశ్వవిద్యాలయాల ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం 14 విశ్వవిద్యాలయాల నాయకులు కలిసి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బోధనేతర సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్ ను రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ ని కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా, జయరాం ను జనరల్ సెక్రెటరీగా, శ్రీనివాస్ యాదవ్ గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఇది కూడ చదవండి-
తొలుత సర్వసభ్య సమావేశంలో ఉత్కంఠ వాతావరణంలో పోటీ ఉంటుందని భావించినప్పటికీ చివరికి ఏకగ్రీవ ఎన్నికలు జరగడం విశ్వవిద్యాలయాల నాయకుల ఐక్యతను ప్రతిబింబించిందని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో రాబోవు రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ మహిపాల్ రెడ్డి, విష్ణు ఆధ్వర్యంలో జరిగింది.
