“PSY-5” Continue Update: 18వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, నేటితో ముగిసిన 5వ విడత పాదయాత్ర

Hyderabad:

BREAKING

5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ను దిగ్విజయవంతంగా ముగించుకుని ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ కు దిష్టి తీసి హారతి ఇస్తున్న సతీమణి శ్రీమతి అపర్ణ.

“బీజేపీ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ @ కరీంనగర్”

బండి సంజయ్ కామెంట్స్:

కరీంనగర్ నగర్ గడ్డపై గర్జించి, గాండ్రిస్తే… వాళ్ళకి వణుకు పుట్టాలి

నిన్ననే ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసినోళ్ళకి మనమేంటో కూడా తెలియాలి కదా…

ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకు రెండు చేతులు జోడించి, ధన్యవాదాలు చెప్తున్నా

ఈ గ్రౌండ్ లో పౌరుషం, ఆవేశం ఉంది

నేను ఇక్కడే పెరిగాను

దుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం తోనే నేను బతికిన. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది

నేను ముందు ఈ డివిజన్ కార్పొరేటర్ ను

2014 లో నాకు ఎమ్మెల్యే గా 47 వేల ఓట్లు ఇచ్చారు

కరీంనగర్ గడ్డ నన్ను ధర్మం కోసం పనిచేయమంది

ధర్మం కోసం యుద్ధం చేయమంది ఈ కరీంనగర్ గడ్డ

హిందూ ధర్మ రక్షణ కోసమే పనిచేస్తున్నా

మీరు గర్వపడేలా… నేను పనిచేస్తున్నా

2018 లో ఎమ్మెల్యే గా నాకు 68 వేల ఓట్లు వచ్చాయి

నేను ఎందుకు ఒడిపోయానో మీకు తెలుసు

ఇంకొకరికి కొమ్ముకాసే అలవాటు నాకు లేదు

నా ధర్మానికి, సమాజానికి తలదించే పని ఎప్పటికీ చేయను

బండి సంజయ్ ఓడిపోతే… కార్యకర్తలు ఏడుస్తున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది

మీ కష్టార్జిత ఫలితమే… నేను కరీంనగర్ ఎంపీగా గెలిచారు

మీ వల్లనే కరీంనగర్ లో పింక్ కలర్ జెండా ను బొందపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించాం

కరీంనగర్ గడ్డపై, ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీ తో మీరు, మీ బండి సంజయ్ ని గెలిపించారు

కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే నేను గెలిచా

ఏ లక్ష్యంతో బిజెపి అధిష్టానం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందో… దానికి అనుగుణంగానే నేను పనిచేస్తున్నా

కార్యకర్తలతో కలిసి తిరగాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే… మీ కోసమే పాదయాత్ర చేస్తున్నా

పచ్చ జెండాను బొందపెట్టి, పింక్ జెండాను పీకేసి, కాషాయ జెండా ఎగరేయాలి

2001 లో సింహగర్జన పేరుతో trs పెట్టిన సభకు కూడా… ఇంతమంది రాలేదు

సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైంది?

తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణ ను తీసేసిండు

తెలంగాణ తో బంధం తొలగించుకున్నాడు

కేసీఆర్ పీడ విరగడయింది

తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్

BRS పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడు

దందాలు, కబ్జాల పేరుతో… లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నడు

లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్… ఇలా అన్ని దందాలు, స్కామ్ లు వాళ్ళవే

తెలంగాణ అభివృద్ధి కి కేసీఆర్ సహకరించడం లేదు

మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు

24 గంటలు మోడీ ని తిడుతూ…ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు

ఇద్దరు సీఎం లు కలిసి దోచుకోవాలని చూస్తున్నారు

ఏ వర్గం సంతోషంగా లేదు

ఇక్కడ ఎంతమందికి 2bhk లు వచ్చాయి?

కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి

తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… నిలువ నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం

ఈ 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలే

కేసీఆర్ ఎన్ని నోటిఫికేషన్ లు ఇచ్చాడు?

తాజాగా 1.46 వేల ఉద్యోగాలు కేంద్ర సర్కారీ నౌకర్లు మోడీ ఇచ్చారు

విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేరు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి

ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? వద్దా?

రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు

మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే… ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు

రైతు రుణమాఫీ చేసిండా?

పాదయాత్ర ద్వారానే.. 8 సంవత్సరాలు ఫార్మ్ హౌజ్ లో పండుకున్న కేసీఆర్… బీజేపీ కి భయపడి, బయటికొచ్చిండు

TRS పార్టీ దుకాణం మూసేసి, ఢిల్లీలో BRS దుకాణం తెరిచిండు

BRS అంటే… బంధిపోట్ల రాష్ట్ర సమితి, బార్ & రెస్టారెంట్ సమితి

గుంటనక్కలు అంతా ఏకమయ్యాయి?

మోడీ సింహం…సింగిల్ గానే వస్తారు

5వ విడత పాదయాత్ర మహిషా(బైంసా) లో ప్రారంభించాం

సకినాలు చేస్తున్న నా హిందువుల అప్పాల్లో ఉచ్చ పోసిన లుచ్చా నా కొడుకుల భరతం పడదాం

BREAKING

“బీజేపీ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ @ కరీంనగర్”

ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ:

ఎలక్షన్స్ రాకముందే.. టిఆర్ఎస్(BRS)పార్టీని పంపించేశారు

తెలంగాణ జాగృతి… ఇప్పుడు భారత్ జాగృతి అయిందంట

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో

కేసీఆర్ దుర్మార్గుడు, మూర్ఖుడే కాదు…

BRS గా TRS ని మార్చింది కాంగ్రెస్ తో కలిసేందుకే

కాంగ్రెస్ కార్యకర్తలకు సోయిచ్చింది. నాయకులకే రావాలి

ఇక్కడ దోచుకున్న సొమ్మును

తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ కు అప్పగించాలన్న డీల్ ను కాంగ్రెస్ తో కుదుర్చుకున్నాడు

కాంగ్రెస్ లో బీ ఫామ్ లు ఇచ్చేది కూడా కేసీఆరే

BRS పార్టీ అంటే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ ని చేయడమే తప్ప, ఇంకా ఏమీ లేదు

ప్రధాని వచ్చినా… స్వాగతం పలకడు కేసీఆర్

BRS పార్టీతో దేశమంతా తిరుగుతాడు అట… ఇక కేటీఆర్ కు ఈ రాష్ట్రాన్ని అప్పగిస్తాడు అట

ఈ కేటీఆర్ అనేటోడు… సాఫ్ట్వేర్ వాళ్ళతో, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతడు. నైట్ లు మ్యూజిక్ వింటడు

లిక్కర్ లేడి నా ఇంటిపైకి గుండాలను పంపింది

ఆంధ్రా ఎంపీ నాతో పార్లమెంట్ లో ఈ భారత్ జాగృతి ఏంటి అని అడిగాడు

కవిత తలుచుకుంటే… మైక్ టైసన్ కు బాక్సింగ్, విరాట్ కోహ్లీ కి క్రికెట్ నేర్పుతాది

నన్ను వెంటాడి, వేటాడి నా మీద నిలబడతా అన్న కవిత.. ఇప్పుడు అయ్య ఎక్కడ చెప్తే అక్కడే అంటోంది

నా మీద కవిత నిలబడాలా..? లేదా?

నీకు భయం ఉంటే… నువ్వు నిలబడు, లేకపోతే నాపై మీ అయ్యను నిలబెట్టు

ఎలక్షన్స్ లో పెట్టే ఖర్చును రూ.100 ల కోట్లకు తీసుకెళ్లింది ఈ BRS పార్టీ

అవినీతి రహిత పాలన రావాలంటే…. బీజేపీ రావాలి

రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు

దందాలు, మాఫియాలు చేసే BRS వాళ్ళు కావాలా?

BREAKING

“ముగిసిన బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర”

SRR College కి చేరుకున్న బండి సంజయ్ & టీమ్

5వ విడత పాదయాత్ర ముగింపు సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు

కాసేపట్లో సభాస్థలికి చేరుకోనున్న బండి సంజయ్

ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ

BREAKING

18వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. బండి సంజయ్ పాదయాత్రలో నడుస్తున్న, వేలాదిగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులు. ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్.

BREAKING

నేటితో ముగియనున్న బండి సంజయ్ 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర”

ఈరోజు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ

ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

బహిరంగ సభలో పాల్గొననున్న కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, తరుణ్ చుగ్ సహా ఇతర ముఖ్య నేతలు

లక్ష మంది జన సమీకరణతో బహిరంగ సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర నాయకత్వం

ఐదు విడతల్లో కలిపి, నేటితో 120వ రోజుపూర్తి చేసుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర

56 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగిన పాదయాత్ర

1403 కిలోమీటర్ల మేర నడిచిన బండి సంజయ్

ఇవాళ్టి సభతో కలిపి మొత్తం 15 భారీ బహిరంగ సభలు, 50కి పైగా మినీ బహిరంగ సభలు నిర్వహించిన తెలంగాణ బీజేపీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బిజెపి

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టడంలో విజయవంతమైన బండి సంజయ్

ప్రతి గ్రామంలో.. ప్రతి గడప వరకు తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలను వివరించడంలో ‘బండి’ సక్సెస్

పాదయాత్రలో భాగంగా… ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి మేమున్నామనే భరోసా కల్పించడంలోనూ… సక్సెస్ అయిన బండి సంజయ్

బూటకపు వాగ్దానాలతో ప్రజలను కేసీఆర్ ఎలా మోసం చేశాడో… కళ్ళకు కట్టినట్టు చెప్పడంలోనూ సఫలీకృతమైన తెలంగాణ బిజెపి రథసారధి

‘బీఆర్ఎస్’ ఒక వైరస్… ‘బిజెపి’ ఒక వ్యాక్సిన్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్

పాదయాత్రలతో… తెలంగాణ బిజెపిలో ఫుల్ జోష్ నింపిన బండి సంజయ్

రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న బీజేపీ క్యాడర్ ను రోడ్డెక్కించి, ప్రజా సమస్యలపై పోరాటం చేయించడంలోనూ సం’జయుడు’ సక్సెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X