అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూమి సమస్యకు త్వరలో పరిష్కారం: ప్రొ కోదండరాం

ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం ను కలిసిన జేఏసీ
అంబేద్కర్ వర్శీటీలో కొనసాగుతున్న ఉద్యోగుల నిరసనలు
70వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూమి సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని ఎమ్మెల్సీ ప్రొ . కోదండరాం జేఏసీ సభ్యులకు హామీ ఇచ్చారు. గురువారం ఆయనను కలిసిన జేఏసీ బృందంతో చర్చించారు. తన విన్నపాన్ని మన్నించి వంటావార్పూ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రొ. కోదండ రాం ను కలిసిన జేఏసీ బృందంలో ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. పల్లవీ కాబడే, డా. వెంకటేశ్వర్లు, డా. రజని, డా. ఉదయుని, రజనీకాంత్ ఉన్నారు.

డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ గురువారం నిరసనను కొనసాగించారు. గత 70 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉధ్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.

Also Read-

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నేతలు డా. రబింద్రనాథ్ సోలమన్; డా. యాకేష్ దైద; హబీబుద్దిన్; పాండు; షబ్బీర్; రాములు; అధ్యాపక; అధ్యాపకేతర ఉద్యోగులు; అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X