Dr B R Ambedkar Open University భూ కేటాయింపు సమస్య పై కొనసాగుతున్న నిరసనలు

69వ రోజుకు చేరిన Dr B R Ambedkar Open University ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల భూమిని కాపాడానికి గత 69 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉధ్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనకకి తీసుకునేవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు.

Also Read-

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; జేఏసీ నేతలు డా. ఎల్వీకే రెడ్డి; ప్రొ. మేరీ సునంద; డా. రజనీ; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; హబీబుద్దిన్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. అంబేద్కర్, డా. రజిత, పాండు; షబ్బీర్; రాములు; అధ్యాపక; అధ్యాపకేతర ఉద్యోగులు; అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X