ఇన్ని రోజులు+ఒక మంచి పని=డా. బి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొ. జి. రాంరెడ్డి విగ్రహా ఆవిష్కరణ

దూర విద్యా వ్యాప్తికి ప్రొ. రాం రెడ్డి కృషి మరవలేనిది : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
రాంరెడ్డికి పద్మ అవార్డు ప్రకటించాలి : ప్రొ. జి. హరగోపాల్
ప్రొ. రాం రెడ్డి గొప్ప దార్శనికులు : ప్రొ. వి. ఎస్. ప్రసాద్

హైదరాబాద్ : దూరవిద్య పితామహుడు, ప్రఖ్యాత విద్యావేత్త, డా. బి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్, ఇగ్నో వ్యవస్థాపకులు ప్రొ. జి. రాం రెడ్డి విగ్రహాని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి డా. బి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆవిష్కరించారు. “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో “లీడర్షిప్ కనెక్ట్” కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం ప్రొ. చక్రపాణి. మాట్లాడుతూ దూరవిద్య విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా చేయడమే కాకుండా అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గదర్శిగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిలిచిందన్నారు. దేశంలో ఉన్నత విద్యా రంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రొ. రాం రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. అదేవిధంగా సీఎస్టీడీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొ. ఆర్. వి. ఆర్. చంద్ర శేకర్ రావు సినర్జీ హాల్ ను ప్రారంభించారు.

ఈ కార్యరమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ ప్రొ. రాంరెడ్డి దూరవిద్య వ్యాప్తికి, అనేక ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు మూలకారకులు అని, ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఎప్పుడో పద్మ అవార్డు రావాల్సిందని, ఇప్పటికి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పద్మ అవార్డు తో గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడ చదవండి-

న్యాక్ మాజీ డైరెక్టర్, డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. వి. ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి దార్శనికతను కొనియాడారు. విశ్వవిద్యాలయ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్ళను ఆయన ప్రస్తావించారు. ఈ విశ్వవిద్యాలయ వ్యాప్తి సమయంలో రాం రెడ్డి కన్న కళలు ఇప్పుడు సాకారం అవుతున్నాయని పేర్కొంటూ ప్రస్తుత వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి పని తీరును కొనియాడారు. అనంతరం పలువురు రిటైర్డ్ ప్రొఫెసర్ లు మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి తో తమకు ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొ. రాం రెడ్డి సతీమణి ప్రమీలా రాం రెడ్డి, ఆయన కుమార్తె జ్యోతి; విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. యల్. విజయా కృష్ణా రెడ్డి; ప్రొ. డి. నరసింహా రెడ్డి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొ. పల్లవి కబ్డే, ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. పి. వెంకట రమణ; ప్రొ. రజని మాజీ అధ్యాపకులు ప్రొ. యస్వీ రాజశేఖర రెడ్డి, ప్రొ. మధుసూదన రెడ్డి, ప్రొ. నాగరాజు నాయుడు, ప్రొ. వెంకటయ్య, ప్రొ. వెంకట్ నారాయణ, ప్రొ. పంజాల నరసయ్య, డా. సంతోష్ రెడ్డి, ప్రొ. హయత్, ప్రొ. వై. ఎస్. కిరణ్మయి, సుదర్శనం, విమలమ్మ, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X