హైదరాబాద్ : కేటో మోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ ఆటోమొబైల్ రంగంలో మరో మైలురాయి అన్నారు. క్లీన్ ట్రాన్స్‌పోర్ట్, స్వదేశీ సాంకేతికత మరియు హరిత ఇంధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ ‘కేటో మోటార్స్’ (Keto Motors) తన మొట్టమొదటి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది. దేశంలోని రద్దీని, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ 9-మీటర్ల ఎలక్ట్రిక్ బస్‌ను ఆపరేటింగ్ పార్టనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బస్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్లు, యాజమాన్యం మరియు ఉద్యోగులకు అభినందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మరియు ఇన్నోవేషన్ రంగాల్లో దేశం అద్భుతమైన మార్పులను చూస్తోందని ఈ వేదిక ద్వారా స్పష్టమైంది. ఒకప్పుడు టీకాలు లేదా ఇతర అవసరాల కోసం దశాబ్దాల పాటు ఎదురుచూసే దుస్థితి నుంచి.. నేడు కోవిడ్ వ్యాక్సిన్‌ను మనమే స్వయంగా అభివృద్ధి చేసి, అభివృద్ధి చెందిన దేశాలకంటే ముందే ప్రపంచంలోని 60కి పైగా దేశాలకు అందించిన స్థాయికి భారత్ ఎదిగింది. ఇదే ఆత్మనిర్భరత ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి కేంద్రం సంపూర్ణ మద్దతు. ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. ఇది దేశం యొక్కఎనర్జీ సెక్యూరిటీ (ఇంధన భద్రత), కాలుష్య నియంత్రణ (పొల్యూషన్ కంట్రోల్), దిగుమతుల తగ్గింపు (ఇంపోర్ట్ రిడక్షన్), సాంకేతిక ఆత్మనిర్భరతకు బలమైన బాటలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ నుంచి బ్యాటరీలు, ఛార్జింగ్ ఫెసిలిటీస్, రీసెర్చ్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ వరకు ప్రతి రంగాన్ని కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. క్లీన్ ఎనర్జీ మరియు PSUల పాత్ర ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్ కూడా హరితంగా (Clean Energy) ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోలార్, విండ్, హైడ్రో మరియు గ్రీన్ ఎనర్జీ కారిడార్లలో భారీ పెట్టుబడులు పెడుతోంది.
Also Read-
ఈ క్రమంలో కోల్ ఇండియా, నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) సంప్రదాయ బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్ మరియు పంప్డ్ స్టోరేజ్ రంగాల్లోకి విస్తరిస్తూ జాతీయ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మరియు ఏఐ (AI) రంగాలకు వెన్నెముకగా నిలిచే లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ వంటి క్రిటికల్ మినరల్స్‌కు చమురుతో సమానమైన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది.దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం రూ. 34 వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను చేపట్టింది.

టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఫార్మా, ఐటీ, డిఫెన్స్‌తో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ డిజైన్ హబ్‌గా మారుతోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలు తమ డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా.. తెలుగు యువ ఇంజనీర్లు ప్రపంచ స్థాయి చిప్‌లను తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్’ ద్వారా చిప్ తయారీ, రీసెర్చ్ మరియు డిజైన్ రంగాలకు భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి.
ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ అగ్రగామి. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నేడు దేశంలో వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో 99.2 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, ఎగుమతులు 11 రెట్లు పెరగగా.. ఈ రంగం ద్వారా సుమారు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. పీఎల్‌ఐ (PLI) పథకాలు, స్థిరమైన పారిశ్రామిక విధానాలతో కేంద్రం ఎలక్ట్రానిక్స్ రంగానికి పూర్తి సహకారం అందిస్తోంది.
ప్రపంచంతో పోటీపడుతూ అద్భుతమైన మౌలిక వసతులు, రోడ్లతో దూసుకుపోతున్న భారత్.. ‘వికసిత భారత్ – 2047’ లక్ష్య సాధన దిశగా పయనిస్తోంది. కేటో మోటార్స్ సాధించిన ఈ విజయం స్వదేశీ సామర్థ్యానికి నిదర్శనం. భవిష్యత్తులో మరింత అధునాతన పరిశోధనలతో కేటో మోటార్స్ పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తూ, దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మరింత తోడ్పాటునందించాలని ఆకాంక్షిద్దాం.
