హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Also Read-
బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి : సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం లోని దుర్గమ్మ, పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆమె అమ్మ వార్లకు స్వయంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్రహ్మ చారి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం సదాశివ పేట పట్టణం లోని దుర్గమ్మ గుడి వద్ద జరిగిన బోనాల ఉత్సవం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఅర్ఎఫ్ కార్మిక సంఘం నాయకుడు శేఖర్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంగారెడ్డి పట్టణం లోని సంజీవ నగర్ కాలనీ లో పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గుడిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మధు, కాలనీ నాయకులు పాల్గొన్నారు.
