తెలంగాణలో వరుసగా పెళ్ళిళ్ళు… ఘనంగా మంత్రుల శుభాకాంక్షలు

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆదివారం అనేక పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఖరారై వధూవరులు పెళ్లి పీటలు ఎక్కారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వరుసగా పెళ్ళిళ్ళకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. శాలువా కప్పి సన్మానించి, ఆశీర్వదించారు.

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఇమ్మడి వెంనుకట రమణ నంచారి మడూర్ గారి కూతురు వివాహానికి వరంగల్, ఆకుతోట కన్వెన్షన్ సెంటర్లో హాజరై నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వారి సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఉషాదయాకర్ గారు.

అనంతరం గోల్డెన్ గార్డెన్ లో అన్నమనేని వారి వివాహానికి హాజరై వధూవరులు సనీష – సందీప్ లను ఆశీర్వదించి, పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితో పాటు ఈ వివాహానికి బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా హాజరయ్యారు.

తరవాత సీనియర్ జర్నలిస్ట్ కొల్ల కృష్ణ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులు భావన రెడ్డి – వివేక్ రెడ్డి లను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు పుల్లూరు అశోక్ కుమార్ గారి కూతురు వివాహం 14న ఉండడంతో ఈరోజు వారి గృహానికి వెళ్లి పెళ్లి కూతురును చేస్తుండగా ఆశీర్వదించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్…

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి పి.ఏ బీమగోని తిరుపతి గారి కుమారుడు సిద్ధార్థ గౌడ్ వర్షశ్రీ ల వివాహ మహోత్సవానికి కుటుంబ సభ్యులతో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, మంత్రితో పాటు వివాహానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్ గారు పాల్గొన్నారు.

తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారి కొడుకు వివాహానికి హైదరాబాద్, బి.ఎం.ఆర్. సార్త కన్వెన్షన్ సెంటర్లో హాజరై నూతన వధూవరులు దుష్యంత్ రావు – శ్వేతలకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

మంత్రితో పాటు వివాహానికి హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గిరిజన, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య, శాసన సభ్యులు శ్రీ ఆరూరి రమేష్, శ్రీ గ్యాదరి కిషోర్, శ్రీ సైదిరెడ్డి, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శ్రీ రవీందర్ నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు, భువనగిరి జెడ్పీ చైర్మన్ శ్రీ సందీప్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ శ్రీ రామచంద్రు నాయక్, మాజీ శాసన సభ్యులు శ్రీ వీరేశం, మాజీ చైర్మన్ శ్రీ గాంధీ నాయక్, ఇతర నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X