హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, రజక సంఘాల నాయకులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ & ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్, ఎమ్మెల్యే శంకర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి.హెచ్. హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ డి. అజయ్ కుమార్, వైస్ చైర్మన్ బంగారి బాబు, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, రజక సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన రజక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వీరనారి చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం మరియు సామాజిక న్యాయం కోసం ధైర్యంగా పోరాడిన మహోన్నత మహిళ అని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Also Read-
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, మహిళల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న రజక సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన రజక సంఘాల నాయకులు వీరనారి చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించారు.
