మాజీ ప్రధాన మంత్రి భారత్ రత్న రాజీవ్ గాంధీ జయంతి, నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వనమహోత్సవంలో…

హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి భారత్ రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ రాజీవ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు నిజామాబాద్ జిల్లా నాయకులు

ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలను, యువత, సాంకేతిక రంగం, స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఆయన దూరదృష్టిని టీ పీసీసీ చీఫ్ స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

వనమహోత్సవంలో మొక్కలు నాటిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్‌లో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వనమహోత్సవంలో భాగంగా మల్లారం గండి వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

One thought on “మాజీ ప్రధాన మంత్రి భారత్ రత్న రాజీవ్ గాంధీ జయంతి, నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వనమహోత్సవంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X