అహంకారం.. అక్రమ దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిందే మీరు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ధ్వజం

హైదరాబాద్ : తాను ఏవిషయమైనా నిర్దిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతానని.. తనతో పెట్టుకోవద్దని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తాను విష నాగుల చెరలో లేనని.. వారు చెప్పే మాటలు విని ఏది పడితే అది మాట్లాడబోనని స్పష్టం చేశారు. అహంకారం.. అక్రమ దందాలతో బీఆర్ఎస్ ను పాతాళంలోకి నెట్టిందే మీరు అంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ‘‘ఎక్స్’’ వేదికగా ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను బీఆర్ఎస్ లో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తే కొన్ని గంటల్లోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. అదే గుంటనక్కతో అంటకాగుతూ పార్టీ అధినేతను తీరును బహిరంగంగా ప్రశ్నించడం పార్టీకి వ్యతిరేకం కాదా అని నిలదీశారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఫాం హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు, ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిన వాళ్లే ఇప్పుడు ఆ పార్టీ అధినేతను తప్పుపట్టడంపై కవిత మండిపడ్డారు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు పార్టీలో ఆయన వైఫల్యాన్ని, ఆయన చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా అని ప్రశ్నించారు.

Also Read-

గణేశ్ నిమజ్జనోత్సంలో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లను బతిమాలుకొని పాటలు ప్లే చేయించుకున్న విషయం గణేశ్ మహరాజ్ కు.. కేటీఆర్ అంతరాత్మకు తెలుసన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే ‘‘నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?’’ అని అహంకారంతో అతని భార్యను అవమానించారని..’’ గతంలో సాయం కోసం వెళ్లిన మహిళను ‘‘నా కోసం కన్నావా’’ అని ఆమె మాతృత్వాన్ని అవమానించారని గుర్తు చేశారు. గుంటనక్క మైండ్ గేమ్ ను బ్లైండ్ గా నమ్ముతూ పెద్ద మనిషిని తప్పు పడుతూ బీఆర్ఎస్ పార్టీకి గోతిని తవ్వుతున్నావని హెచ్చరించారు.

One thought on “అహంకారం.. అక్రమ దందాలతో పార్టీని పాతాళంలోకి నెట్టిందే మీరు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ధ్వజం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar