పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులు

హైదరాబాద్ : మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన జయంతి వేడుకల్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ఎంపీ రాజీవ్ శుక్ల, చింతా మోహన్ తదితర నేతలతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు.

Also Read-

ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి వారు ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా దేశ అభ్యున్నతికి అనేక సంస్కరణలతో పాటు దేశంలో సమాచార, సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయులు రాజీవ్ గాంధీ గారు అని ఈ సందర్భంగా మధుయాష్కీ పేర్కొన్నారు.

One thought on “పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X