నెహ్రూ ఆదేశాలతో పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారు
రామనంద తీర్థ, జమాలపురం కేశవ రావ్, బూర్గుల రామకృష్ణ రావ్, పివి లాంటి వాలను స్మరించుకోవాలి
బీజేపీకి చరిత్ర తెలియదు.. చరిత్ర ను తిరగరాసుడు తెలుసు
వీళ్ళకి గాంధీ అంటే పడదు ఆయన ను హత్య చేసిన గాడ్సే దేవుడు
హైదరాబాద్ : తెలంగాణ విలీనం దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విలీనానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలను ఈ రోజున స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విలీనం కోసం అహర్నిశలు కృషి చేసిన రామనంద తీర్థ, జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహరావు వంటి మహనీయులను, నిజాం వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, కమ్యూనిస్టు యోధులను స్మరించడం ప్రతి తెలంగాణ వాసి బాధ్యత అన్నారు.

బీజేపీ పాత్రపై స్పందిస్తూ…ఆ పార్టీ 1980లో పుట్టిందని, స్వాతంత్ర్యం, తెలంగాణ విలీన పోరాటాలకు సంబంధం లేనిదని ఎద్దేవా చేశారు. “ఇది పాత బీజేపీ కూడా కాదు.. 2014లో పుట్టిన మోడీ-షా బీజేపీ. వీరికి చరిత్ర తెలియదు, చరిత్రను వక్రీకరించడం మాత్రమే తెలుసు. గాంధీని గౌరవించని, గాడ్సేను దేవుడిగా చూసే వారి నుండి దేశభక్తి ఆశించడం వృథా” ప్రయాసగా అభివర్ణించారు.

1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం “ఆపరేషన్ పోలో” ద్వారా నాలుగు రోజుల్లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిందని గుర్తుచేశారు. కానీ, నేడు అదే పటేల్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఆయన చేసిన విలీనాన్ని “విమోచన”గా పిలవడం పటేల్ ను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.
ప్రస్తుతం అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని లొంగదీసుకుని మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. బీహార్లో ఓటు దోపిడీ ప్రయత్నాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నడిపిస్తున్న “ఓటు చోరీ ఉద్యమం” బీజేపీ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ త్యాగస్వరూపమని, స్వాతంత్ర్యం కోసం అనేక మంది నాయకులు జైలు పాలయ్యారని… సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాని అయ్యే అవకాశమున్నా ఆర్థిక నిపుణుడు డా. మన్మోహన్ సింగ్ను రెండుసార్లు ప్రధాని చేశారు అనేది కాంగ్రెస్ త్యాగానికి నిదర్శనం అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజా పాలన కొనసాగుతోందని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుంచి సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Also Read-
TPCC Chief Mahesh Kumar Goud’s Speech on Telangana Merger Day at Gandhi Bhavan
Hyderabad: On the occasion of Telangana Merger Day, TPCC President and MLC Mahesh Kumar Goud extended heartfelt greetings to the people of Telangana. Addressing the gathering, he said that it was important to recall the sacrifices and struggles of the Congress party in bringing about the merger of Telangana with the Indian Union.
He paid homage to great leaders such as Ramananda Tirtha, Jamalapuram Keshava Rao, Burgula Ramakrishna Rao, and P. V. Narasimha Rao, as well as people’s warriors like Komaram Bheem, Doddi Komuraiah, Chakali Ailamma, Sheikh Bandagi, and the communist fighters who fought against the Nizam.
Criticizing the BJP, he remarked that the party, formed in 1980, had no role in India’s freedom movement or the Telangana merger struggle. “This is not even the old BJP—it is the Modi-Shah BJP that was born in 2014. They know nothing about history except how to distort it. They don’t respect Gandhi; for them, Godse is a deity. What patriotism can one expect from such people?” he questioned.

Recalling the events of 1948, he noted that under the leadership of Sardar Vallabhbhai Patel, the Congress government carried out “Operation Polo” and integrated the Hyderabad State into India within four days. He asked whether calling Patel’s historic merger a “liberation” was not, in fact, an insult to Patel himself, as the BJP does today.
Coming down heavily on the Modi government, he accused it of undermining constitutional institutions and manipulating the Election Commission to win a third term in office. He alleged that attempts at vote rigging in Bihar exposed the BJP’s disregard for democracy, and stressed that Rahul Gandhi’s “Vote Theft Movement” had rattled the ruling party.
Mahesh Kumar Goud further emphasized that Congress has always been a party of sacrifice. “Many of our leaders went to jail during the freedom struggle. Even when Sonia Gandhi and Rahul Gandhi had opportunities to become Prime Minister, the party chose economist Dr. Manmohan Singh, making him Prime Minister twice—this reflects the Congress party’s spirit of sacrifice,” he said.
Highlighting the present governance in Telangana, he lauded Chief Minister Revanth Reddy’s leadership, pointing to welfare measures such as free bus travel for women and the supply of fine rice. He called upon people to stand by the Congress government, which is committed to both development and welfare.
