మోదీ రాకముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ కి వస్తున్నారు. మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ చేపడుతారా లేదా చెప్పాలి. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గాంధీ భవన్ లో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజూ మీడియాతో మాట్లాడారు.

కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పాము దర్యాప్తు జరపాలని సిబిఐ విచారణ కోరుతూ సిబిఐ లేఖ రాశాము సిబిఐ విచారణ ఎందుకు చేయడం లేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఎన్నికల ముందు కాళేశ్వరం లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్రం లో బీజేపీ అధికారం లోకి వచ్చాక సిబిఐ విచారణ చేయడం లేదు. కాళేశ్వరం విషయం లో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలి. తుపాకీ మా భుజాల మీద కాల్చాలని బండి సంజయ్ చూస్తున్నారు.

బీఆర్ఎస్ నేతల మద్దతు లేకుండా బీజేపీ కి రాష్ట్రం లో 8 సీట్లు వచ్చేవా. హరీష్ రావు మద్దతు లేకుండా బీజేపీ ఎంపీ గా మెదక్ లో గెలిచారా. బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు కాబట్టి మీపై కాళేశ్వరం సిబిఐ విచారణ చేయడం లేదు. వరి వేస్తే ఉరి అన్నది మీరు మీరే కదా ఇవ్వాలా మీరు రైతుల కోసం ఏదో చేస్తున్నట్లు ముసలి కన్నీరు కారుస్తున్నారు..రైతులకు రుణమాఫీ రైతు బంధు బోనస్ ఇస్తుంది మా ప్రభుత్వం.

Also Read-

మా ప్రభుత్వం మక్కలు కూడా కొంటుంది. బెంగాల్ లో బీజేపీ కి అనుకూల పరిస్థితులు లేవు. బెంగాల్ లో బీజేపీ ఓటు చోరీ తో గెలిచింది. 90లక్షల ఓట్లు తొలగించింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటు ను కాపాడుకోవాలి. మమతబెనర్జీ, కేజ్రీవాల్ మీద కేసు లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీద ఎందుకు పెట్టడం లేదు. బీజేపీ వాళ్ళు తలుచుకుంటే రేపు సీబీఐ విచారణ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar