Congratulations! తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డికి TOPA శుభాకాంక్షలు

హైదరాబాద్: మా నాయకుడే మహా నాయకుడై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గౌరవనీయులైన రేవంత్‌ రెడ్డి గారికి తెలంగాణ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిదుల హార్దిక శుభాకాంక్షలు తెలుపి జవీ రేవంత్‌ రెడ్డి చిత్రపాఠానికి పాలాభిషేఖం చేసి ప్రజలకు మిఠాయిలు పంచారు.

హైదరాబాద్‌ లక్కిడికాపూల్‌ లోని తెలంగాణ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ కార్యలయంలో పింటర్స్‌ అందరు కలిసి ఒక పింటర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి అద్బుతమైన సేవలు అందించి సంపద సృష్టించి చాలా మందికి ఉపాధి కల్పించి సేవకార్యక్రమాలు చేసి రాజకీయాల్లో గొప్ప విజయాలు సాదించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అభినందనీయమని పింటర్స్‌ అందరు కొనియాడరు.

తెలంగాణ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చామల రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్‌ ఉపాద్యాక్షలు కరుణాకర్‌ ప్రధాన కార్యదర్శి క్రిష్ణారెడ్డి, కోశాధికారి రాధకృష్ణ, నేషనల్‌ కోఆర్డినేటర్‌ దయాకర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌, జయదీప్‌ సింగ్‌, రాజేశ్‌ భరద్వాజ్‌, దాచేపల్లి వినోద్‌, బి. వెంకట్‌రెడ్డి, ఏ. ఉత్తమ్‌ రెడ్డి తో పాటు చాలామంది పింటర్స్‌ రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన సందర్బంగా వేడుకలు జరుపుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వేలాది ప్రింటింగ్‌ ప్రేస్‌లు ఉన్నయాని కోట్లలో వ్యాపారాలు చేస్తు ఇందులో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షలు చామల రవీందర్‌ రెడ్డి అన్నారు. ప్రింటింగ్‌ రంగంలో జవీ రేవంత్‌ రెడ్డి సహకారంతో వెలుగులు నిండనున్నాయని చెప్పారు. తెలంగాణ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ భవనం నిర్మించి స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసి ఈ రంగంలో యువతకు ఉజ్వల భవిషత్‌ను అందించాలని జవీ ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X