హైదరాబాద్ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు క్రీడా లోకం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ పాదయాత్రలో ప్రత్యేకంగా పాల్గొని, కేంద్రమంత్రితో కలిసి అడుగులు వేశారు.

యువతను మత్తు పదార్థాల బారి నుండి కాపాడి, వారిని క్రీడలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మళ్లించేందుకు కిషన్ రెడ్డి చేస్తున్న ఈ మహా యజ్ఞానికి గోపీచంద్ తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో పలువురు దివ్యాంగులు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి కేంద్రమంత్రి పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
శారీరక వైకల్యాన్ని లెక్కచేయకుండా, తమ వీల్ చైర్లపైనే ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంటూ యాత్రతో పాటు ముందుకు సాగారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలనే కేంద్రమంత్రి గొప్ప సంకల్పంలో తాము కూడా భాగస్వాములమవుతామని వారు చాటిచెప్పారు. దివ్యాంగుల అంకితభావం, ఉత్సాహం పాదయాత్రలో పాల్గొన్న వారందరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపింది.
Also Read-
దేశ భవిష్యత్తు అయిన యువతరం చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల్లో రాణిస్తూ దేశానికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ రాకతో పాదయాత్రలో పాల్గొన్న యువత, విద్యార్థుల్లో మరింత ఉత్సాహం వెల్లివిరిసింది.
