“బర్త్ సర్టిఫికెట్లతో పాస్ పోర్ట్ పొంది పాతబస్తీలో పాగా వేస్తున్న ఉగ్రవాదులు”

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన

కేసీఆర్ రాజీనామా చేయాలి

బర్త్ సర్టిఫికేట్ల జారీ వైఫల్యానికి బాధ్యత వహించాల్సిందే…

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే

బర్త్ సర్టిఫికెట్లతో పాస్ పోర్ట్ పొంది పాతబస్తీలో పాగా వేస్తున్న ఉగ్రవాదులు

ఐఎస్ఐ అడ్డాగా పాతబస్తీ

దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా మూలాలు పాతబస్తీలోనే బయటపడటమే నిదర్శనం

ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేసిన కేసీఆర్

అల్లర్లు స్రుష్టించి కేంద్రాన్ని బదనాం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర

కేసీఆర్ కు చిత్తుశుద్ధి ఉంటే…. సీబీఐ విచారణ జరిపించాలి

• గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం వెనుక ఆశ్యర్యం, ఆందోళన కలిగించే అంశం.

• జారీ చేసిన బర్త్ , డెత్ సర్టిఫికెట్లలో ఎక్కువగా పాతబస్తీలోనే బయటపడటం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం.

• కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనం. దీనికంతటికి మొదటి ముద్దాయి సీఎం కేసీఆరే. నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి.

Related News :

• బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్ పోర్టులు పొంది, హైదరాబాద్ లో అడుగుపెట్టి పాతబస్తీని అడ్డగా మార్చి దేశంలో అల్లర్లు స్రుష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది.

• కేసీఆర్ పాలనలో పాతబస్తీ ఐఎస్ఐ కేంద్రంగా మారింది. స్లీపర్ సెల్స్ ను పెంచి పోషిస్తున్నరు. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ఇక్కడే మూలాలు బయటపడుతున్నాయి.

• ఓట్ల కోసం, సీట్ల కోసం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేశాడు… ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా పర్మిషన్ లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్.

• టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు స్రుష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. తద్వారా కేంద్ర వైఫల్యంగా చిత్రీకరించి రాజకీయ లబ్ది పొందే నీచమైన కుట్రలకు తెరదీశారు.

• టాస్క్ ఫోర్స్ దాడి చేసిన కొన్ని మీ సేవా కేంద్రాల్లోనే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. పాతబస్తీ మొత్తం జల్లెడ పడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు బయటపడే అవకాశం ఉంది.

• వీటితోపాటు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా పొంది పాతబస్తీ పౌరులుగా చలామణి అవుతూ హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నింటిల్లో అల్లర్లు స్రుష్టించి భారతదేశాన్ని విచ్చిన్నం చేసేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోంది.

• తక్షణమే పాతబస్తీలో జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డులపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. ప్రభుత్వ పెద్దల, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం లేనందున సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

• కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా విచారణ జరిపి కింది స్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటోంది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చర్చను పక్కదారి పట్టించేందుకు ప్లాన్ చేస్తోంది.

• బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X