హైదరాబాద్: పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్ విత్తనాలు .. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకటే రకమైనవి. ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రైవేట్ కంపెనీలే. ప్యాకెట్ ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 450 గ్రాములకు రూ 853/-. పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది.
కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అటువంటి డీలర్ల లైసెన్స్ లు రద్దుకు వెనుకాడం. అవసరమైన దానికన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని అంచనా. ఈ మేరకు 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి.
మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.