తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి జక్కని అనిత నియమితులు, హ్యాండ్లూమ్ సంక్షేమానికి కృషి

హైదరాబాద్ : తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి జక్కని అనిత నియమితులయ్యారు. పద్మశాలి సమాజానికి చెందిన ఆమె, 2010 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు.

ఈ నియామకానికి సంబంధించి శ్రీమతి జక్కని అనిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన శ్రీమతి మీనాక్షి నటరాజన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఇది కూడ చదవండి-

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హ్యాండ్లూమ్ రంగ అభివృద్ధికి, ముఖ్యంగా పద్మశాలి హ్యాండ్లూమ్ సంక్షేమానికి కృషి చేస్తానని, సంప్రదాయ వృత్తిని ఆధునిక మార్కెట్‌కు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X