సంగారెడ్డి మండలం లో కుల్పగూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్ర, ఫోం సర్వీస్ సెంటర్ ప్రారంభం

కంది మండలం బేగం పేట గ్రామం లో బిఆర్ఎస్ కార్యకర్త ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం లో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

హైదరాబాద్ : సంగారెడ్డి, కంది మండలాల్లో బుధవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు. సంగారెడ్డి మండలం కుల్పగూరు గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రైవేటు మిల్లర్ల వద్ద వడ్లు అమ్మ కూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిద్రుప్ప రఘు, బలరాం, బుచ్చిరాం లు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

బిఅర్ఎస్ కార్యకర్త కు చెందిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

అనంతరం బేగంపేట గ్రామం లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశం లో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన గ్రామ కార్యకర్త ఎల్లా గౌడ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా గృహం నిర్మాణం పూర్తయింది. ఎల్లా గౌడ్ ఇంటి గృహ ప్రవేశానికి నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మన అనే బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు చిదృప్ప రఘు గౌడ్, మహేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

Also Read-

ఫోం సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి బై పాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోం సర్వీసింగ్ సెంటర్ ను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ వెంకట్ రాజు, కౌన్సిలర్ నవాజ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X